Homeటాప్ స్టోరీస్పిక్‌టాక్‌:  బేబీ బంప్‌తో విరుష్క ఏంటీ ప్ర‌యోగం?

పిక్‌టాక్‌:  బేబీ బంప్‌తో విరుష్క ఏంటీ ప్ర‌యోగం?

పిక్‌టాక్‌:  బేబీ బంప్‌తో విరుష్క ఏంటీ ప్ర‌యోగం?
పిక్‌టాక్‌:  బేబీ బంప్‌తో విరుష్క ఏంటీ ప్ర‌యోగం?

భార‌త క్రికెట్ ర‌ధ‌‌సార‌థి విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లాడిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ గ‌ర్భం దాల్చిన విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రిలో పండంటి పాప‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నానంటూ ప్ర‌క‌టించిన అనుష్క భారీ క‌స‌ర‌త్తులు చేస్తోంది. గ‌ర్భీణీ స్త్రీలు బ‌రువు మోయ‌డానికి వీళులేద‌ని, మెట్లు ఎక్కొద్దంటూ కండీష‌న్‌లు పెడుతుంటారు. అలాంటి వారిని నేటి త‌రం పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

జిమ్ముల్లోకి వెళ్లి కస‌ర‌త్తులు చేస్తున్నారు. అలా చేస్తేనే సుఖ ప్ర‌స‌వం అవుతుంద‌ని న‌మ్ముతున్నారు. అదే ఫార్ములాని స్టార్ హీరోయిన్‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ఫాలో అవుతూ వున్నారు. ఎమీ జాక్స‌న్ జిమ్‌లోకి దూరి బేబీ బంప్‌తో డ‌బెంల్స్ మోస్తూ క‌స‌ర‌త్తులు చేసింది. ఆ త‌రువాత స‌మీరారెడ్డి బేబీ బంప్‌తో అండ‌ర్ వాట‌ర్‌లో చేసిన ఫీట్ ని చూసీ అవాక్క‌య్యారు కూడా. క‌ల్కీ కోయ్చిలిన్ కూడా ఇదే త‌ర‌హా ఫీట్ల‌తో అవాక్క‌య్యేలా చేసింది.

- Advertisement -

ఇటీవ‌ల గ‌ర్భ‌వ‌తి అయిన అనుష్క కూడా అదే త‌ర‌హాలో క‌స‌ర్తులు చేయిస్తున్న ఓ త్రో బ్యాక్ ఫోటోని  ఇన్ స్టా వేదిగా షేర్ చేసింది. ఈ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. దీనికి ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేసింది. `యోగా నా జీవితంలో ఒక భాగం కాబట్టి నేను గర్భవతి కాకముందే  మలుపులు, విపరీతమైన ఫార్వర్డ్ భంగిమ‌లను మినహాయించి నేను చేస్తున్న అన్ని ఆసనాలను న‌న్ను చేయమని నా డాక్ట‌‌ర్ సిఫారసు చేసాడు.  నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్న శిర్షాసనం కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు  నా సమతుల్యతకు మద్దతుగా నా భర్త నిలిచారు` అని తెలిపింది అనుష్క‌. ఈ పోస్ట్ పై నెటిజ‌న్‌లు కామెంట్‌లు విసురుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All