Homeటాప్ స్టోరీస్బాలీవుడ్ లో జగన్ బయోపిక్

బాలీవుడ్ లో జగన్ బయోపిక్

ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి తిరుగులేని మెజారిటీతో సంచలన విజయం సాధించడంతో బాలీవుడ్ లో జగన్ బయోపిక్ ని తీసే ఆలోచనలో ఉన్నారట బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ . జగన్ భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో జగన్ పై సంచలన కథనాలు వచ్చాయి జాతీయ మీడియాలో . దాంతో ఆ కథనాలను బేస్ చేసుకొని జగన్ బయోపిక్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

ఇక అనురాగ్ కశ్యప్ జగన్ బయోపిక్ తీయాలన్న ఆలోచన చేస్తున్నాడు . అసలే టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బయోపిక్ ల హవా నడుస్తోంది . బయోపిక్ లు సూపర్ డూపర్ హిట్ లు అవుతుండటంతో జగన్ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం . ఎందుకంటే జగన్ తండ్రి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చాడు , జగన్ బయటకి రావడంతో అతడిపై కేసులు పెట్టి జైల్లో వేశారు . అలాగే పదేళ్ల పాటు పోరాటం చేసి ప్రజలతో మమేకమై అధికారంలోకి వచ్చాడు దాంతో జగన్ బయోపిక్ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All