Homeటాప్ స్టోరీస్జగన్ పార్టీ తరుపున ఎన్టీఆర్ మనవడు

జగన్ పార్టీ తరుపున ఎన్టీఆర్ మనవడు

NTR grandson want to contest on YSRCP ticketనందమూరి తారకరామారావు మనవడు హితేష్ చెంచురామ్ జగన్ పార్టీ తరుపున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు వెన్నంటి ఉన్న డాక్టర్ దగ్గుబాటి వేంకటేశ్వర రావు- పురంధేశ్వరి ల తనయుడే ఈ హితేష్ చెంచురామ్ . గతకొంత కాలంగా దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు . అయితే ఎన్నికల బరిలో తనకు బదులుగా తన తనయుడు హితేష్ ని రంగంలోకి దించాలని భావిస్తున్నాడు దగ్గుబాటి . అందుకే ప్రతిపక్ష నేత అయిన వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ని తన తనయుడితో కలిసాడు .

కొడుకు భవిష్యత్ కోసం జగన్ తో చర్చించిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన దగ్గుబాటి చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగాడు . త్వరలోనే జగన్ పార్టీలో హితేష్ చేరబోతున్నాడని , ఎప్పుడు ….. ఎక్కడ అన్నది మాత్రం మా అనుచరులతో సమావేశమైన తర్వాత తెలియజేస్తామన్నారు దగ్గుబాటి . అలాగే పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీలోనే ఉంటుందని హితేష్ మాత్రం జగన్ పార్టీలో చేరతాడని స్పష్టం చేసాడు . ఇక ఎన్టీఆర్ మనవడు అయిన హితేష్ జగన్ పార్టీ తరుపున పోటీ చేస్తే ప్రజలు ఎలా ఆదరిస్తారు అన్నది మరో మూడు నెలల్లో తేలిపోనుంది .

- Advertisement -

English title: NTR grandson want to contest on YSRCP ticket

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All