Homeన్యూస్అనుపమ 'బటర్ ఫ్లై' ఫస్ట్ లుక్ రిలీజ్

అనుపమ ‘బటర్ ఫ్లై’ ఫస్ట్ లుక్ రిలీజ్

అనుపమ 'బటర్ ఫ్లై' ఫస్ట్ లుక్ రిలీజ్
అనుపమ ‘బటర్ ఫ్లై’ ఫస్ట్ లుక్ రిలీజ్

రౌడీ బాయ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ ..ఈరోజు 25 వ ఏటా అడుగుపెట్టింది. ఈ సందర్బంగా అభిమానులు , సినీ ప్రముఖులు ఈమెకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈమె నటిస్తున్న తాజా చిత్రం  `బటర్ ఫ్లై`నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆనందం నింపారు.

జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై గంటా సతీష్ బాబు దర్శకత్వం లో రవి ప్రకాష్ బోడపాటి ప్రసాద్ తిరువళ్లూరి ప్రదీప్ నల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఓ వాల్ ముందు చేతులు కట్టకుని అనుపమ కనిపిస్తుండగా.. వెనకాల సప్తవర్ణాల బటర్ ఫ్లై (సీతాకోక చిలుక) రెక్కలు విప్పుకుని కనిపిస్తున్న తీరు అనుపమే బటర్ ఫ్లై మారిపోయినట్టుగా కనిపిస్తోంది.

- Advertisement -

త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రానున్నాయని చిత్ర బృందం తెలిపింది. ఇది కాక అనుపమ మరికొన్ని చిత్రాల్లో నటిస్తుంది. నిఖిల్ తో కార్తికేయ సీక్వెల్ గా రూపొందుతున్న కార్తీకేయ 2, సుకుమార్ నిర్మాణ సహకారంలో గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న `18 పేజెస్`..అలాగే హెలెన్ చిత్రాల్లో నటిస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All