
మలయాళీ నటి అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా బాగానే సినిమాలు చేసింది. వరసగా ఇక్కడ సినిమాలు చేసిన అనుపమ ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ సరసన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అందులో మొదటిది రొమాంటిక్ డ్రామా 18 పేజెస్. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. కుమారి 21ఎఫ్ వంటి సినిమాతో ఆయన అందరినీ ఇంప్రెస్ చేసాడు.
ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హోమ్లీ లుక్ లో కనిపించనుంది. ఆమె ఫస్ట్ లుక్ ను మోషన్ పోస్టర్ ద్వారా విడుదల చేసారు. ఈ మోషన్ పోస్టర్ లో ప్లెజంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు అనుపమ లుక్ భలేగా సెట్ అయింది.
సుకుమార్ ఈ సినిమాకు స్క్రిప్ట్ ను అందించగా గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 18 పేజెస్ విడుదలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.