
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం యూఎస్ లో ఉన్న విషయం తెల్సిందే. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం యూఎస్ వెళ్లిన రజినీకాంత్ ఈ నెలలో తిరిగి ఇండియాకు రానున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తోన్న సినిమా అన్నాత్తే. ఈ సినిమా షూటింగ్ రజినీకాంత్ యూఎస్ కు వెళ్ళడానికి ముందే పూర్తయిపోయింది.
సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా సన్ పిక్చర్స్ అన్నాత్తే విడుదలపై క్లారిటీ ఇచ్చింది. “అన్నాత్తే దీపావళికి మీరు రెడీనా” అనే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. నవంబర్ 4న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ అప్డేట్ తో పాటు కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేసారు.
శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో తెలుగులో దరువు, శౌర్యం చిత్రాలను డైరెక్ట్ చేసాడు శివ. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా ఖుష్బూ, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
#SuperstarRajinikanth’s #Annaatthe will be a #Deepavali release. pic.twitter.com/6MIGZ7PGX6
— Sreedhar Pillai (@sri50) July 1, 2021