Homeటాప్ స్టోరీస్అనిల్ రావిపూడి సెటైర్ వేసి తప్పు చేశాడా?

అనిల్ రావిపూడి సెటైర్ వేసి తప్పు చేశాడా?

anil ravipudi getting negativity with satire on ala vaikunthapuramulo
anil ravipudi getting negativity with satire on ala vaikunthapuramulo

ఈ సంక్రాంతికి విడుదల కానున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో. ఈ రెండు చిత్రాలు ఒకదానికొకటి పోటీగా ఒకే రోజున అంటే జనవరి 12న తమ చిత్రాలు విడుదల కాబోతున్నట్లు ప్రకటించాయి. అది కూడా గంట వ్యవధిలో జరగడంతో ఒక్కసారిగా పోటీ వాతావరణం బయటకొచ్చింది. తర్వాత రిలీజ్ డేట్ విషయంలో మార్పులుండొచ్చు ఏమో కానీ ప్రస్తుతానికి అయితే ఈ రెండు చిత్రాల పోస్టర్లపై జనవరి 12 విడుదల అని స్పష్టంగా అందరికీ కనిపించేలా వేస్తున్నారు. రిలీజ్ డేట్ విషయంలో పోటీ రావడంతో ప్రతి దాంట్లోనూ రెండు చిత్రాలపై పోటీ రావడం అనేది సహజం. ప్రతి చిన్న విషయానికి రెండు చిత్రాలకు పోలిక పెడుతుంటారు. ఇప్పుడు ఈ రెండు చిత్రాల విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి విషయంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఇలా ఉంటుంది, అల వైకుంఠపురములో అలా ఉంటుంది అంటూ డిస్కషన్స్ ఇప్పటినుండే మొదలైపోయాయి. ఇక ఫ్యాన్స్ సంగతి వేరే చెప్పాలా. సోషల్ మీడియాలో మినీ యుద్ధమే చేస్తున్నారు. తమ హీరో గొప్ప అని చెప్పుకోవడానికి బానే కష్టపడుతున్నారు.

ఇవన్నీ పక్కన పెట్టి ప్రమోషన్స్ విషయంలో చూసుకుంటే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో కంటే చాలా వెనుకబడి ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో ప్రమోషన్స్ విషయంలో కొత్త సంప్రదాయానికి తెర తీసింది. నాలుగు నెలల ముందు నుండే చిత్ర ప్రమోషన్స్ ను చేపట్టింది. అప్పటినుండి ఆగకుండా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. ముందు ఒక మినీ టీజర్, కొన్ని పోస్టర్లు, రెండు పాటలు ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విడుదలయ్యాయి. ఇవన్నీ అల వైకుంఠపురములో చిత్రానికి బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా విడుదలైన రెండు పాటలు కల్ట్ హిట్ స్టేటస్ తెచ్చుకోవడంతో అల వైకుంఠపురములో కు విపరీతమైన హైప్ వచ్చింది.

- Advertisement -

మరోవైపు సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ విషయంలో సాంప్రదాయ పద్దతిని పాటిస్తోంది. ఇప్పటివరకూ ఒక మినీ పాట, కొన్ని పోస్టర్లు తప్పితే మరే విధమైన ప్రమోషనల్ మెటీరియల్ బయటకి రాలేదు. అయితే ఎవరూ అడగకుండానే సరిలేరు దర్శకుడు అనిల్ రావిపూడి మొన్న దీపావళికి సుబ్బరాజు, వెన్నెల కిషోర్ ను పెట్టి ఒక సెటైరికల్ వీడియోను వదిలాడు. ప్రమోషన్స్ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని, మన సినిమా వచ్చేది సంక్రాంతికని ఆ వీడియోలో ఉంది.

ఇది అల వైకుంఠపురములో చిత్రంపై సెటైర్ లానే భావించారందరూ. ప్రమోషన్స్ విషయంలో ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంటుంది. అంత మాత్రాన అనిల్ రావిపూడి ఇలా సెటైర్ వేయడం ఏమిటని అంటున్నారు. తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయవచ్చు. అనిల్ రావిపూడి కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకండా ఏం లేని దానికి ఇలా సెటైర్ వేయడం దేనికని అనిల్ రావిపూడిని ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా సరిలేరు నీకెవ్వరు చిత్రానికి నెగటివిటీ తీసుకొస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All