Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో.. అలా 100 మిలియన్ కొట్టేసింది

అల వైకుంఠపురములో.. అలా 100 మిలియన్ కొట్టేసింది

అల వైకుంఠపురములో.. అలా 100 మిలియన్ కొట్టేసింది
అల వైకుంఠపురములో.. అలా 100 మిలియన్ కొట్టేసింది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెల్సిందే. ఈ సంక్రాంతికి పోటీ ఎక్కువుండడంతో అల వైకుంఠపురములో టీమ్ ప్రమోషన్స్ విషయంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేయడంతో రెండిటికీ రెస్పాన్స్ బాగా ఉంది. మొదటి పాట సామజవరగమన విడుదలైన దగ్గరనుండి హల్చల్ చేస్తూ ఆడియో స్ట్రీమింగ్ సైట్స్ లో దూసుకుపోతోంది. సౌత్ ఇండియాలోనే మోస్ట్ లైక్డ్ సాంగ్ గా సామజవరగమన రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. ఈ పాట ఈ కాలంలో విడుదలైన బెస్ట్ మెలోడీగా శ్రోతల నుండి రెస్పాన్స్ అందుకుంటోంది. దీని తర్వాత విడుదలైన రాములో రాముల సాంగ్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. మొదటి రోజే 8.3 మిలియన్ వ్యూస్ సాధించి ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన మొదటి దక్షిణాది పాటగా రికార్డు సృష్టించింది. ఈ రెండు పాటలూ ప్రస్తుతం ఎక్కడ విన్నా హల్చల్ చేస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ రెండు పాటలు కలిపి ఒక అరుదైన రికార్డు సాధించాయి. ఆడియో స్ట్రీమింగ్ పరంగా యూట్యూబ్, జియో సావన్ లో కలిపి 100 మిలియన్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాయి ఈ పాటలు. సామజవరగమన పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించాడు. ఇక రాములో రాముల మాస్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ కలిసి పాడగా కాసర్ల శ్యామ్ లిఖించాడు. ఈ రెండు పాటలు ఇంతగా ప్రజాదరణ పొందడంతో అల వైకుంఠపురములో టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రానికి ఇప్పటినుండే భారీ బజ్ ఏర్పడింది. అలాగే క్రేజీ ఆఫర్లతో బయ్యర్లు కూడా ఈ సినిమా హక్కులను కొనుక్కోవడానికి పోటీ పడుతున్నారు.

- Advertisement -

అల వైకుంఠపురములో చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న చిత్రమిదే. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని వారు అనుకుంటున్నారు. ఇక డీజే తర్వాత బన్నీ సరసన పూజ హెగ్డే రెండోసారి నటిస్తోంది. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. సుశాంత్ కు కూడా మేజర్ రోల్ ఉన్న ఈ చిత్రంలో నవదీప్ మరొక రోల్ చేస్తున్నాడు. నివేద పేతురాజ్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఎస్ ఎస్ థమన్ తన సంగీతంతో భారీ అంచనాలని నెలకొల్పాడు. నవంబర్ లో ఈ చిత్ర ప్రమోషన్స్ మరింత జోరందుకోనున్నాయి. నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే దానికి సంబంధించిన అప్డేట్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. అలాగే మరో పెప్పి నెంబర్ ను ఈ నెలలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, చినబాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. అదే రోజున సరిలేరు నీకెవ్వరు కూడా పోటీగా రానున్న విషయం తెల్సిందే.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All