Homeటాప్ స్టోరీస్`ఎఫ్ 3` మొద‌లెట్టేది అప్పుడేనా?

`ఎఫ్ 3` మొద‌లెట్టేది అప్పుడేనా?

 

Anil Ravipudi F3 will start in augst
Anil Ravipudi F3 will start in augst

విక్ట‌రీ వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ తొలి సారి క‌లిసి న‌టించిన చిత్రం `ఎఫ్‌2`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా సంచ‌ల‌నం సృష్టించింది. వంద కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌రైంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించింది.

- Advertisement -

ఈ చిత్రానికి సీక్వెల్‌ని చేయ‌బోతున్న‌ట్టు దర్శ‌కుడు సినిమా చివ‌ర‌లో చిన్న హింట్ ఇవ్వ‌డంతో అప్ప‌టి నుంచి ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడ‌నే వార్త‌లు వ‌రుస‌గా వినిపించ‌డం మొద‌లైంది. 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి త్వ‌ర‌లోనే సీక్వెల్ రాబోతోంది. `ఎఫ్ 3` పేరుతో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట‌.

ఇప్ప‌టికే స్క్రిప్ట్ ప‌నులు మొద‌లుపెట్టిన అనిల్ రావిపూడి ఆగ‌స్టులో ఈ చిత్రాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాడ‌ని తెలిసింది. `ఎఫ్ 2`లో న‌టించిన వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ ఇందులోనూ న‌టిస్తార‌ట‌. వెంక‌టేష్ ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` చిత్రంలో న‌టిస్తున్నారు. వ‌రుణ్‌తేజ్ `బాక్స‌ర్‌` చిత్రం చేస్తున్నారు. ఈ రెండు పూర్తయిన త‌రువాతే `ఎఫ్ 3` సెట్స్ పైరి రానుంద‌ని తాజా స‌మాచారం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All