HomeUncategorizedవిక్ట‌రీ వెంక‌టేష్ కూడా ఆపేశాడు!

విక్ట‌రీ వెంక‌టేష్ కూడా ఆపేశాడు!

 

Venkatesh  Narappa shooting stoped
Venkatesh  Narappa shooting stoped

క‌రోనా వైర‌స్ కార‌ణంగా వ‌రుస షూటింగ్‌లు అర్థాంత‌రంగా నిలిపివేస్తున్న విష‌యం తెలిసిందే. స్టార్ హీరోలు సైతం త‌మ సినిమాల షూటింగ్‌ల‌ని వాయిదా వేస్తున్నారు. ఫంక్ష‌న్‌ల‌ని కూడా ర‌ద్దు చేసుకుంటున్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో సేప్టీ ప్రికాష‌న్స్‌ని పాటించాలంటూ స్టార్స్ సామాన్య జ‌నానికి సందేశాలిస్తున్నారు. బ‌ర్త్‌డే పార్టీల‌ని సైతం ర‌ద్దు చేసుకుంటూ చాలా మంది త‌మ‌లాగే ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌ల‌ని సాధ్య‌మైనంత వ‌ర‌కు అవైడ్ చేయాల‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

- Advertisement -

ప్ర‌భాస్ త‌న సినిమా షూటింగ్ పూర్త‌యిపోవ‌డంతో బుధ‌వారం ప్ర‌త్యేక విమానంలో ఇండియా బ‌య‌లుదేరిన విష‌యం తెలిసిందే. సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ కూడా త‌న తాజా చిత్ర షూటింగ్‌ని ర‌ద్దుచేసుకుని మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌కు తిరిగి వ‌చ్చారు. శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో బ్లాక్ మాస్కుతో వెంకీ క‌నిపిస్తున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

త‌మిళ హిట్ చిత్రం `అసుర‌న్` ఆధారంగా రూపొందుతున్న `నార‌ప్ప‌` రీమేక్‌లో వెంక‌టేష్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ గ‌త కొన్ని రోజులుగా చెన్నై ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. మంగ‌ళ‌వారం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిపోవ‌డంతో హీరో వెంక‌టేష్ హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు. అయితే ఆయ‌న బ్లాక్ మాస్క్‌తో క‌నిపించ‌డంతో స్టార్స్‌కి క‌రోనా భ‌యం పీక్స్‌కి చేరింద‌ని అర్థ‌మ‌వుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All