Homeగాసిప్స్అనిల్ పట్టుబడితేనే మహేష్ అలా...

అనిల్ పట్టుబడితేనే మహేష్ అలా…

అనిల్ పట్టుబడితేనే మహేష్ అలా...
అనిల్ పట్టుబడితేనే మహేష్ అలా…

సూపర్ స్టార్ మహేష్ బాబు భీభత్సమైన డ్యాన్సర్ ఏం కాదు. కొంతమంది టాప్ హీరోలతో పోల్చితే మహేష్ కొంత డ్యాన్స్ పరంగా వెనుకబడే ఉంటాడు. ఈ విషయాన్ని మహేష్ కూడా ఒప్పుకుంటాడు. అయితే మహేష్ బ్యాడ్ డ్యాన్సర్ అయితే కాదు. కొన్ని సెన్సిబుల్ మూవ్స్ వేయడంలో మహేష్ తర్వాతే ఎవరైనా. తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా డ్యాన్స్ మూవ్స్ కంపోజ్ చేస్తే మహేష్ చెలరేగిపోతాడు. అయితే ఎందుకనో మహేష్ గత కొన్ని సినిమాల నుండి మరీ డ్యాన్స్ పరంగా నీరసిస్తున్నాడు. డ్యాన్స్ వేయగలిగుండి కూడా ఏదో మొక్కుబడిగా చేసి వెళ్లిపోతున్న భావన. సినిమాలు కూడా సీరియస్ గా చేసినవె ఎక్కువ ఉండడంతో ఇటు డ్యాన్స్ పరంగా రిలీఫ్ లేకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ ఒకింత అసహనానికి గురైన మాటైతే వాస్తవం.

అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయాలన్నీ ముందే గ్రహించాడు. తాను మహేష్ ను చూపించాలన్న విధానంపై ముందే అవగాహనకు వచ్చేసాడు. సరిలేరు నీకెవ్వరు విషయంలో మహేష్ ను ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా చూపించినట్లుగా టీజర్ చూస్తేనే అర్ధమైంది. ఇదిలా ఉంటే మహేష్ ఈ సినిమాలో డ్యాన్స్ ఇరగదీశాడని కొన్ని వార్తలు రాగా, మహేష్ ఫ్యాన్స్ కు బయట ఆందోళన ఉన్నా కానీ లోలోపల ఎలాంటి స్టెప్స్ వేయించారోనన్న ఆందోళన ఉంది.

- Advertisement -

అయితే నిన్న రిలీజైన డాంగ్ డాంగ్ సాంగ్ సాంగ్ తో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చేయగా, మహేష్ బలాలకు అనుగుణంగా స్టెప్స్ కంపోజ్ చేసినట్లుగా అర్ధమవుతోంది. ముఖ్యంగా మహేష్ సాంగ్ లో చాలా చలాకీగా ఉన్నాడు. అంతవరకూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ. మహేష్ డ్యాన్స్ విషయంలో అనిల్ రావిపూడి పట్టుబట్టి కచ్చితంగా ఫ్యాన్స్ కోసం కొన్ని మూవ్మెంట్స్ ఉండాల్సిందేనని అన్నాడట. దర్శకుడు అడిగితే మహేష్ ఏదైనా చేసేస్తాడు కాబట్టి, సరిలేరు నీకెవ్వరు విషయంలో డ్యాన్స్ పై మళ్ళీ శ్రద్ధ పెట్టినట్లుగా తెలుస్తోంది. డాంగ్ డాంగ్ సాంగ్ మాత్రమే కాకుండా మైండ్ బ్లాక్ సాంగ్ లో కూడా మహేష్ డ్యాన్స్ ఇరగదీసాడట. మహేష్ అభిమానులకు ఈ చిత్రం ఫుల్ ట్రీట్ అవ్వనుందని అనిల్ రావిపూడి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All