Homeటాప్ స్టోరీస్పుష్ప: దాక్షాయణిగా షాక్ ఇచ్చిన అనసూయ

పుష్ప: దాక్షాయణిగా షాక్ ఇచ్చిన అనసూయ

పుష్ప: దాక్షాయణిగా షాక్ ఇచ్చిన అనసూయ
పుష్ప: దాక్షాయణిగా షాక్ ఇచ్చిన అనసూయ

అటు బుల్లితెరపై తన గ్లామరసంతో వెలిగిపోతోన్న అనసూయ అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తోంది. అప్పటిదాకా చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చిన అనసూయకు రంగస్థలం చిత్రంతో భారీ బ్రేక్ ఇచ్చాడు సుకుమార్. ఈ సినిమాలో పోషించిన రంగమ్మత్త పాత్ర తనకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. మరోసారి సుకుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అనసూయ. సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప ది రైజ్ లో అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది.

దాక్షాయణిగా నెగటివ్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఈమె ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు. ఎక్కువగా గ్లామర్ గా కనిపించడానికి ఇష్టపడే అనసూయ దాక్షాయణిగా మాత్రం కన్నింగ్ లుక్ లోకి మారిపోయింది. పల్లెటూర్లలో క్రూరులైన జమీందార్ తరహా పాత్రను పోషిస్తున్నట్లు ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది.

- Advertisement -

అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రను పోషిస్తోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో పుష్ప డిసెంబర్ 17న విడుదలవుతోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. సునీల్ మరో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. తన ఫస్ట్ లుక్ ను కూడా ఇటీవలే విడుదల చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All