Homeటాప్ స్టోరీస్ఆ బయోపిక్ లో హాట్ భామ అనసూయనా

ఆ బయోపిక్ లో హాట్ భామ అనసూయనా

anasuya as politician in yatra filmకీర్తి శేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ” యాత్ర ” బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే . మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వై ఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది . మరో విశేషం ఏంటంటే …… సింగిల్ షెడ్యూల్ లో ఈ యాత్ర చిత్ర నిర్మాణం పూర్తిచేసుకోనుంది . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం కావడంతో అప్పుడే ఈ చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈ చిత్రంలో హాట్ భామ అనసూయ నటించనున్నట్లు తెలుస్తోంది . జబర్దస్త్ తో అందాలను ఆరబోసి కుర్రాళ్ళని పిచ్చెక్కించిన ఈ భామ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది . రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా నటించి అవార్డు పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్య పోయేలా చేసింది .

అనసూయ అంటేనే అందాల ఆరబోత అలాంటిది రంగస్థలం చిత్రంలో నటనతో ఆకట్టుకుంది దాంతో యాత్ర చిత్రంలో రాజకీయ నాయకురాలి పాత్ర చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట దర్శకులు మహి వి రాఘవ . మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఈ చిత్రం మలయాళంలో కూడా భారీ ఎత్తున విడుదల అవడం ఖాయం , దాంతో అనసూయ కనుక ఈ సినిమాలో నటిస్తే తన మార్కెట్ ని కేరళలో కూడా పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All