Homeన్యూస్సర్కార్ వారి పాట లో మహేష్ రోల్ ఇదే అంటూ నోరు జారిన అనంత శ్రీరామ్..

సర్కార్ వారి పాట లో మహేష్ రోల్ ఇదే అంటూ నోరు జారిన అనంత శ్రీరామ్..

సర్కార్ వారి పాట లో మహేష్ రోల్ ఇదే అంటూ నోరు జారిన అనంత శ్రీరామ్..
సర్కార్ వారి పాట లో మహేష్ రోల్ ఇదే అంటూ నోరు జారిన అనంత శ్రీరామ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలు మొదలుపెట్టి సినిమా ఫై అంచనాలు పెంచుతున్నారు. రీసెంట్ గా విడుదలైన కళావతి సాంగ్ యూట్యూబ్ లో అనేక రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.

కళావతి పాటను క్రేజీ సింగర్ సిద్ శ్రీరామ్ పాడగా, ప్రముఖ సాహిత్య రచయిత అనంత శ్రీరామ్ లిరిక్స్ అందిచారు. ఇక ఈ మెలోడీకి వచ్చిన రెస్పాన్స్‌తో అనంత శ్రీరామ్ ఇప్పుడు వరుసగా టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు వారి పాట చిత్రంలో మహేశ్ రోల్ ఎలా ఉంటుందో రివీల్ చేశారు. ఇందులో హీరో ఒక మొండోడు.. ఎవరూ లేని అనాధగా పెరిగిన వ్యక్తి. అతని జీవితంలో అసలు అమ్మాయి వాసన కూడా తెలియదు.

- Advertisement -

ఎప్పుడు చూసినా గొడవల్లో, కొట్లాటలలో ఉండేవాడు. ఇలాంటి వాడికి ప్రేమ ఒక్కసారిగా వచ్చినప్పుడు.. దాన్ని అతను ఏ విధంగా వ్యక్త పరుస్తాడు..అనే ఆలోచనలో నుంచే ఈ కళావతి పాటను రాశాను.. అని చెప్పుకొచ్చారు. శ్రీరామ్ చెప్పిన విశేషాలతో అభిమానులు ఉత్సహంగా ఉన్నారు. మొన్నటి వరకు ఈ మూవీ లో మహేష్ ఏ రోల్ లో కనిపిస్తాడో అని అంత మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు శ్రీరామ్ క్లారిటీ ఇవ్వడం తో అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All