Homeన్యూస్ఆనంద్ దేవరకొండ ఈసారి థియేటర్లోనే!

ఆనంద్ దేవరకొండ ఈసారి థియేటర్లోనే!

ఆనంద్ దేవరకొండ ఈసారి థియేటర్లోనే!
ఆనంద్ దేవరకొండ ఈసారి థియేటర్లోనే!

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. అయితే ఈ చిత్రం థియేటర్లో విడుదల కాలేదు. ఓటిటిలో విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇది ఆనంద్ కు రెండో సినిమా. ఇప్పుడు మూడో చిత్రాన్ని కూడా పూర్తి చేసాడు ఆనంద్.

దామోదర అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్ర టైటిల్ పుష్పక విమానం. కమల్ హాసన్ నటించిన క్లాసిక్ టైటిల్ ను పెట్టుకుని వస్తున్నాడు ఆనంద్. విజయ్ నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ది హిల్స్ కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో విడుదల కానుంది.

- Advertisement -

ఈ చిత్రానికి కూడా ఓటిటి ఆఫర్లు వచ్చినా థియేటర్స్ కే వస్తున్నారు. నవంబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది. అదే రోజున విడుదలవుతోన్న నాగ శౌర్య లక్ష్యతో పోటీ పడబోతోంది. పోస్టర్స్ చూస్తుంటే ఆసక్తికరంగానే ఉన్నాయి. పెళ్లి నేపథ్యంలో సాగే కన్ఫ్యూజన్ కామెడీలా అనిపిస్తోంది. మరి ఓటిటిలో సక్సెస్ సాధించిన చిన్న దేవరకొండ థియేటర్లో కూడా తొలి హిట్ కొడతాడేమో.

 

View this post on Instagram

 

A post shared by Anand Deverakonda (@ananddeverakonda)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All