
తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పై అమిత్ షా చూపు పడిందట ! రేవంత్ రెడ్డి లాంటి వాడు బీజేపీ లో చేరితే తెలంగాణలో ఆ ఊపే వేరుగా ఉంటుందని భావిస్తున్నాడట ! కేసీఆర్ కు చెక్ పెట్టే సరైన మొనగాడు రేవంత్ మాత్రమే ! అందుకే అతడ్ని పార్టీలోకి తెచ్చుకునే పనిలో పడ్డారట కాషాయదళం . వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు కమలనాథులు , అందుకు ఇప్పుడున్న నాయకత్వం సరిపోదని , రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ కావాల్సిందే అని డిసైడ్ అయ్యారట .
అయితే రేవంత్ రెడ్డి మాత్రం తనని నమ్మి పార్టీ బాధ్యతలు ఇవ్వడమే కాకుండా కొడంగల్ లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానములో పోటీ చేయడానికి అవకాశం కలిపించిన రాహుల్ గాంధీ కి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయడం ఇష్టం లేక కిమ్మనకుండా ఉండిపోయాడట ! అంతేకాదు బీజేపీ – టీఆర్ఎస్ లు తెరచాటు స్నేహం కొనసాగిస్తున్నాయని అలాంటి పార్టీలో చేరడం వల్ల ప్రయోజనం ఏముంటుందని కూడా అంటున్నాడట రేవంత్ . అంటే కేసీఆర్ పై కమలనాథులు కఠిన వైఖరి అవలంబిస్తే అప్పుడు రేవంత్ పార్టీ మార్పుపై ఆలోచిస్తాడేమో !