Homeగాసిప్స్బన్నీ ప్లానింగ్  నెక్స్ట్ లెవెల్లో ఉందిగా

బన్నీ ప్లానింగ్  నెక్స్ట్ లెవెల్లో ఉందిగా

బన్నీ ప్లానింగ్  నెక్స్ట్ లెవెల్లో ఉందిగా
బన్నీ ప్లానింగ్  నెక్స్ట్ లెవెల్లో ఉందిగా

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ తన ప్లానింగ్ ను కూడా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాడు. అల వైకుంఠపురములో చిత్రం ఇతర భాషల్లో విడుదల కాకపోయినా సాంగ్స్  కారణంగా అన్ని భాషల వారికీ చేరువైంది. ఈ నేపథ్యంలో తన తర్వాతి చిత్రం పుష్పతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారాలని ప్లాన్ చేసాడు. ఈ సినిమాను తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ మలయాళంలో బన్నీకు మార్కెట్ ఉంది కాబట్టి పెద్ద ఆందోళన చెందాల్సిన పనిలేదు.

ముఖ్యంగా అల్లు అర్జున్ ఇప్పుడు హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టాడు. రీసెంట్ గా వరుడు కావలెను ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అల్లు అర్జున్, హిందీ సినిమాలు మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నాయని, దీపావళి సందర్భంగా సూర్యవంశీ చిత్రంతో హిందీ సినిమాలు విడుదల మొదలైందని, ఆ సినిమా బాగా ఆడాలని, అందరి సినిమాలు బాగుండాలని అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు.

- Advertisement -

అయితే ఈ వ్యాఖ్యలను అల్లు అర్జున్ తెలుగులోనే చెప్పగా, కొద్ది నిమిషాలకే ట్విట్టర్ లో బాలీవుడ్ హేమాహేమీలైన కరణ్ జోహార్, రోహిత్ శెట్టి లాంటి వాళ్ళు స్పందించారు. అల్లు అర్జున్ కు థాంక్స్ చెబుతూ ట్వీట్లు పెట్టారు. ఇదంతా మ్యూచువల్ అండర్స్టాండింగ్ పద్దతిలో జరుగుతున్నట్లు అర్ధమవుతోంది. ఈరోజు సూర్యవంశీ గురించి చెప్పిన అల్లు అర్జున్ పుష్ప చిత్రం గురించి రేపు ఆ బాలీవుడ్ పెద్దలు ప్రమోట్ చేస్తారన్నమాట. బన్నీ ప్లానింగ్ ఏ వేరబ్బా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All