Homeగాసిప్స్పుష్ప తర్వాత మాస్ కా బాప్ అంటోన్న బన్నీ

పుష్ప తర్వాత మాస్ కా బాప్ అంటోన్న బన్నీ

పుష్ప తర్వాత మాస్ కా బాప్ అంటోన్న బన్నీ
పుష్ప తర్వాత మాస్ కా బాప్ అంటోన్న బన్నీ

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు బన్నీ. ఇటీవలే కరోనా నుండి కోలుకున్న బన్నీ, పుష్ప షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా వెల్లడైన విషయం తెల్సిందే. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో మొదటి పార్ట్, దాని తర్వాత కొన్ని నెలలకు రెండో పార్ట్ ను విడుదల చేయాలన్నది ప్లాన్ గా పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఆసక్తి పెరిగింది. కొరటాల శివతో సినిమా ఉంటుంది కానీ అది వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయింది. మరి పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో పనిచేస్తాడు అన్న ప్రశ్నకు బోయపాటి శ్రీను అన్న సమాధానం వినిపిస్తోంది.

- Advertisement -

సరైనోడు చిత్రంతో ఈ ఇద్దరూ మాస్ హిట్ సాధించారు. ఇప్పుడు దానికి మించే కథను సిద్ధం చేసాడట బోయపాటి. బన్నీకి ఫైనల్ నరేషన్ ఇవ్వడమే మిగిలిందట. అది కూడా పూర్తయితే ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. చూడాలి మరి బన్నీ ఓకే చేస్తాడో లేదో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All