
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన అల వైకుంఠపురములో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విజయం ఇచ్చిన ఊపులో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్పను మొదలుపెట్టాడు. ఈ సినిమాలో బన్నీ ఒక వెరైటీ పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడని ప్రాధమికంగా తేలింది. పుష్ప ఫస్ట్ లుక్ కూడా ఆసక్తికరంగా అనిపించింది. అయితే మార్చ్ లోనే షూటింగ్ మొదలుపెట్టాల్సిన ఈ సినిమా ఇప్పుడు నవంబర్ లేదా డిసెంబర్ నుండి మొదలవుతుందని అంటున్నారు.
ఇక పుష్ప విషయంలో మొదటినుండి బన్నీ లుక్ ఆసక్తి రేపుతోంది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ కనిపిస్తున్న తీరు అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది. బాగా పెరిగిన పూర్తిగా చిందరవందర లుక్ అభిమానులకు నచ్చింది. మరి ఇదే ఫైనల్ లుక్ నా లేక మరో లుక్ కోసం జుట్టు ఇలా పెంచుతున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.
Latest clicks of Our Stylish Star @alluarjun during his trip with friends and family ❤️
That rugged look and transformation ??
Rachaha.. Rachasya…Rachobyaha ??#Pushpa #AlluArjun pic.twitter.com/oBohROxdWZ
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) September 13, 2020
AAttttttt.. Uber cool Bunny Boyy In Curly Hair Looks ? ?@alluarjun ✨ #Pushpa pic.twitter.com/pWrWScDT57
— SSAA fAAn Club (@SSAAfanclub) September 13, 2020