Homeగాసిప్స్అంధుడి పాత్రలో అలరించనున్న అల్లు అర్జున్?

అంధుడి పాత్రలో అలరించనున్న అల్లు అర్జున్?

అంధుడి పాత్రలో అలరించనున్న అల్లు అర్జున్?
అంధుడి పాత్రలో అలరించనున్న అల్లు అర్జున్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కొద్ది నెలలు వాయిదా పడ్డా ఇప్పుడు తిరిగి ప్రారంభమవుతోంది.

హైదరాబాద్ లో చిన్న షెడ్యూల్ పూర్తైన తర్వాత గోవాలో ఈ చిత్ర భారీ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది. ఇక పుష్ప పార్ట్ 1 విడుదలయ్యాక అల్లు అర్జున్ ఐకాన్ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ రెండేళ్ల నుండీ చర్చల దశలో ఉంది. అల్లు అర్జున్ ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేసినా కానీ పెండింగ్ లో పెట్టాడు.

- Advertisement -

మొత్తానికి పుష్ప పార్ట్ 1 తర్వాత ఐకాన్ ఉంటుంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఛాలెంజింగ్ రోల్ ను చేస్తున్నాడు. అంధుడి పాత్రలో బన్నీ అలరించనున్నాడు. ఐకాన్ గురించి మరింత సమాచారం త్వరలోనే తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All