Homeటాప్ స్టోరీస్మెగా ప్రాజెక్ట్‌ చేతులు మారుతోందా?

మెగా ప్రాజెక్ట్‌ చేతులు మారుతోందా?

మెగా ప్రాజెక్ట్‌ చేతులు మారుతోందా?
మెగా ప్రాజెక్ట్‌ చేతులు మారుతోందా?

`బాహుబ‌లి` ఇచ్చిన ధైర్యంతో  టాలీవుడ్‌లో పాన్ ఇండియా స్థాయి చిత్రాల వొర‌వ‌డి మొద‌లైంది. భారీ బ‌డ్జెట్ సినిమాలంటే భ‌య‌ప‌డే నిర్మాత‌లు `బాహుబ‌లి` త‌రువాత భారీగా బ‌డ్జెట్ చిత్రాల్ని నిర్మించ‌డానికి అనూహ్యంగా ముందుకొస్తున్నారు. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో `హిర‌ణ్య‌క‌శ్య‌ప‌` చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేశారు. ఓ హాలీవుడ్ సంస్థ‌తో క‌లిసి డి. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించాల‌ని ప్లాన్ చేశారు.

గ‌త ఐదేళ్లుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడ‌క్ష‌న్స్ వ‌ర్క్ జ‌రుగుతోంది. హాలీవుడ్ సినిమాల త‌ర‌హాలో ప్రారంభం కానుంద‌ని ప్ర‌చారం జ‌రిగిన ఈ చిత్రం ఇప్ప‌టికే సెట్స్ పైకి ఎప్పుడు రానుంద‌న్న విష‌యాల్లో క్లారిటీ లేదు. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కోసం ఇప్ప‌టికే 15 కోట్లు ఖ‌ర్చు చేశార‌ట‌. ఇదిలా వుంటే ఈ చిత్రంలో రానా న‌టించే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని, ఇందులో మెగా హీరో న‌టించే అవ‌కాశం వుంద‌ని తాజా టాక్‌.

- Advertisement -

ఈ మూవీలో రానా ప్లేస్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు బ‌న్నీతో చ‌ర్చలు జ‌రుపుతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.  గుణ‌శేఖ‌ర్ రూపొందించిన `రుద్ర‌మ‌దేవి` చిత్రంలో బ‌న్నీ గోన గ‌న్నారెడ్డిగా న‌టించి ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All