Homeగాసిప్స్అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలన పడిందా?

అల్లు అర్జున్ ‘ఐకాన్’ మళ్ళీ మూలన పడిందా?

అల్లు అర్జున్ 'ఐకాన్' మళ్ళీ మూలాన పడిందా?
అల్లు అర్జున్ ‘ఐకాన్’ మళ్ళీ మూలాన పడిందా?

ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ మారాడు కానీ ఐకాన్ ప్రాజెక్ట్ ను మాత్రం చేయాలనుకోవట్లేదట. ఈ ఐకాన్ ప్రాజెక్ట్ గురించిన వార్తలు గత కొన్ని సంవత్సరాలుగా చక్కర్లు కొడుతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఐకాన్ ప్రాజెక్ట్ ను మూడేళ్ళ క్రితం ప్రకటించారు. వేణు శ్రీరామ్ చెప్పిన కాన్సెప్ట్ తనకు చాలా బాగా నచ్చిందని అల్లు అర్జున్ ఎగ్జైట్ అయ్యాడు కూడా. ఐకాన్ తో పాటు అదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో, సుకుమార్ పుష్ప చిత్రాలను కూడా ఓకే చేసాడు బన్నీ.

అయితే ఐకాన్ ను పక్కనపెట్టి మిగిలిన రెండు చిత్రాలను పూర్తి చేసాడు. ప్రస్తుతం పుష్ప ది రైజ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. పుష్ప ది రైజ్, తర్వాత ఐకాన్ చేయాలని రీసెంట్ గా భావించాడు బన్నీ. వకీల్ సాబ్ తో మంచి విజయం సాధించడంతో వేణు శ్రీరామ్ పై నమ్మకం పెరిగి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

- Advertisement -

అయితే మళ్ళీ ఇప్పుడు నిర్ణయంలో మార్పు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. బోయపాటితో బన్నీ సినిమా చేసే అవకాశముందని అంటున్నారు. అఖండతో కనుక బోయపాటి శ్రీను విజయం సాధించగలిగితే వెంటనే అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా పట్టాలెక్కుతుందిట. ఏదేమైనా అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All