Homeగాసిప్స్అల్లు అర్జు‌న్ `పుష్ప‌`పై అది రూమ‌రా?

అల్లు అర్జు‌న్ `పుష్ప‌`పై అది రూమ‌రా?

అల్లు అర్జు‌న్ `పుష్ప‌`పై అది రూమ‌రా?
అల్లు అర్జు‌న్ `పుష్ప‌`పై అది రూమ‌రా?

అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఊర‌ మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌గా సుకుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా క‌న్న‌డ సోయగం క్రేజీ గాళ్ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తియిపోయింది. మ‌లి షెడ్యూల్‌ని కేర‌ళ అడ‌వుల్లో ప్లాన్ చేశారు. అదీ సాధ్యం కాని ప‌క్షంలో న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో తీయాల‌నుకున్నారు కానీ ప్లాన్ మారింది.

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో సుకుమార్ ప్లాన్ మొత్తం మారిన‌ట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ కార‌ణంగానెల రోజుల‌కు మించి డేట్ వేస్ట‌యిపోవ‌డంతో  `పుష్ప‌` షూటింగ్ షెడ్యూల్ మొత్తం మారిన‌ట్టు వార్తు వినిపిస్తున్నాయి. ముందు చేసుకున్న ప్లాన్ ప్ర‌కారం షూటింగ్ స్టార్ట్ అయితే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది కానీ నెల ఆల‌స్యం కావ‌డంతో రిలీజ్ స‌మ్మ‌ర్‌కు మారే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

- Advertisement -

షేషాచ‌లం అడవుల్లో గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో బ‌న్నీ రెండు గెట‌ప్‌ల‌లో క‌నిపిస్తాడ‌ని తాజాగా వినిపిస్తోంది. లారీ డ్రైవ‌ర్‌గా, ఫారెస్ట్  ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో నిజ‌మెంత‌నేది చిత్ర బృందం వెల్ల‌డించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All