Homeగాసిప్స్మురుగదాస్ కు ఎస్ చెప్పిన బన్నీ

మురుగదాస్ కు ఎస్ చెప్పిన బన్నీ

మురుగదాస్ కు ఎస్ చెప్పిన బన్నీ
మురుగదాస్ కు ఎస్ చెప్పిన బన్నీ

ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ సులువుగా ఏం ఎదిగిపోలేదు. ఎంట్రీ ఈజీగానే దక్కినా కానీ తన కష్టం వెలకట్టలేనిది. కథ విషయంలో బన్నీ అంత ఈజీగా కంప్రమైజ్ అవ్వడు. అలాగే ఒక్క సారి సినిమా సెట్ అయిందంటే దానికోసం ఎంత చెయ్యొచ్చో దానికంటే ఇంకొంత ఎక్కువే చేస్తాడు. అందుకే బన్నీ కెరీర్ లో సక్సెస్ రేట్ ఎక్కువ. మిగతా టాప్ హీరోలతో పోల్చుకుంటే బన్నీ ఈ విషయంలో చాలా ముందున్నాడు. నా పేరు సూర్య వంటి ప్లాప్ తర్వాత ఒక ఏడాది అంతా సినిమా చేయని బన్నీ అల వైకుంఠపురములో చిత్ర విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ప్రస్తుతం పుష్ప ది రైజ్ చేస్తున్నాడు. ఇందుకోసం తనను తాను ఎంతలా మార్చుకున్నాడో మనం చూసాం. పుష్ప పార్ట్ 2 షూటింగ్ కూడా సగం పూర్తయినట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఐకాన్ చేయనున్న బన్నీ మరో చిత్రాన్ని కూడా ఓకే చేసాడట.

- Advertisement -

రీసెంట్ సినిమాలతో ఫామ్ కోల్పోయిన టాలెంటెడ్ దర్శకుడు మురుగదాస్ అల్లు అర్జున్ తో ప్యాన్ ఇండియా చిత్రాన్ని చేయనున్నాడు. గత కొన్ని నెలల నుండి జరుగుతున్న స్టోరీ సిట్టింగ్స్ ఒక దశకు వచ్చాయని సమాచారం. స్క్రిప్ట్ తో బన్నీ సంతృప్తి చెందడంతో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే అది ఎప్పుడు మొదలవుతుంది అన్నదాపి క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All