Homeటాప్ స్టోరీస్అల్లు అరవింద్ స్ట్రాటజీ అదిరిపోయిందిగా!

అల్లు అరవింద్ స్ట్రాటజీ అదిరిపోయిందిగా!

అల్లు అరవింద్ స్ట్రాటజీ అదిరిపోయిందిగా!
అల్లు అరవింద్ స్ట్రాటజీ అదిరిపోయిందిగా!

మెగా నిర్మాత అల్లు అరవింద్, ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ నిర్మాతల్లో ఒకరు. గీతా ఆర్ట్స్ సంస్థపై సినిమాలు నిర్మించే అల్లు అరవింద్, ఏదైనా సినిమా టేకప్ చేసాడంటే దాని ప్లానింగ్ వేరుగా ఉంటుంది. ప్రేక్షకుల్లో మినిమం గ్యారంటీ అన్న భావన ఏర్పడుతుంది. అసలు ఏ సినిమాకైనా కంటెంట్ తర్వాత రిలీజ్ టైమింగ్ అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఒక్కోసారి కంటెంట్ సూపర్బ్ గా ఉన్నా కూడా సరైన రిలీజ్ టైమింగ్ లేక ఫెయిల్ అయిన సినిమాలను చూసాం. అలాగే కంటెంట్ యావరేజ్ గా ఉన్నా రిలీజ్ టైమింగ్ సెట్ అవ్వడంతో సూపర్ డూపర్ హిట్ అయిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటే అల్లు అరవింద్ ప్లానింగ్ వేరుగా ఉంటుందని తెలుస్తోంది. ముందుగా ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెట్టేటప్పుడే రిలీజ్ డేట్ ను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్స్ వేయడం గీతా ఆర్ట్స్ కు ఉన్న ప్రధానమైన మంచి లక్షణం. సినిమా కంటెంట్ ను బట్టి అది ఎప్పుడు రావాలనేది కూడా చూసుకోవాలి. పండగ, సెలవు రోజులు ఏవైనా వచ్చాయంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమాలు ఉండాలి.

ప్రతిరోజూ పండగే సినిమా చేద్దామనుకున్నప్పుడే ఈ సినిమా కచ్చితంగా పండక్కి లేదా హాలీడే సీజన్ లో తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు అల్లు అరవింద్. సంక్రాంతికి విడుదల చేద్దామని ముందు భావించినా అక్కడ విపరీతమైన పోటీ ఉంది. పైగా తన సినిమా అల వైకుంఠపురములో కూడా అదే సీజన్ లో వస్తోంది. ఇలా రెండు సినిమాలు తనవే పండక్కి పోటీ పడడం మంచిది కాదని భావించి ప్రతిరోజూ పండగేను క్రిస్మస్ కు ముందు వారం రిలీజ్ చేసాడు. ఈ చిత్రానికి రిలీజ్ టైమింగ్ భలేగా కుదిరింది. అక్టోబర్ సగం నుండి డిసెంబర్ సగం వరకూ సరైన సినిమాలే లేక ప్రేక్షకులు మొహం వాచిపోయేలా ఎదురుచూసారు.

- Advertisement -

ఈ రెండు నెలలు పూర్తి స్తబ్దుగా మారిపోయిన మార్కెట్ వెంకీ మామతో కొంత కదలిక వస్తే ప్రతిరోజూ పండగేతో పూర్తిగా మారింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే 70 శాతానికి పైగా పెట్టుబడి వెనక్కి వచ్చింది. పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో ప్రతిరోజూ పండగే మరో వారం కూడా బాక్స్ ఆఫీస్ ను రూల్ చేయడం ఖాయం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All