Homeటాప్ స్టోరీస్అల్లు అరవింద్ నోరు మమ్ముట్టి అలా మూయించాడట

అల్లు అరవింద్ నోరు మమ్ముట్టి అలా మూయించాడట

అల్లు అరవింద్ నోరు మమ్ముట్టి అలా మూయించాడట
అల్లు అరవింద్ నోరు మమ్ముట్టి అలా మూయించాడట

మలయాళ నటుడు మమ్ముట్టి విలక్షణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎన్నో పాత్రలకు తనదైన శైలిలో జీవం పోశారు ఆయన. తెలుగులో మమ్ముట్టి చేసినవి రెండే సినిమాలు అయినా దళపతి వంటి డబ్బింగ్ సినిమాలతో ఆయన నటనను ఆస్వాదించే అవకాశం దొరికింది. ఇక తెలుగులో చేసినవి కూడా ప్రత్యేకమైన సినిమాలే. అప్పట్లో స్వాతి కిరణం చేసిన మమ్ముట్టి, ఈ మధ్యనే యాత్ర సినిమాను చేసాడు. ఈ రెండు సినిమాల మధ్య దాదాపు పాతికేళ్ళు గ్యాప్ ఉండడం గమనార్హం. అయితే ఈ పాతికేళ్లలో చాలా మంది తెలుగు దర్శకులు, నిర్మాతలు తనను సంప్రదించారని, కాను అవి విలన్ పాత్రలో, క్యారెక్టర్ పాత్రలో అవ్వడం వల్ల చేయనని చెప్పేసానని గతంలో మమ్ముట్టి తేల్చి చెప్పేసారు. అయితే వైఎస్సార్ బయోపిక్ కాబట్టి చేయడానికి ముందుకొచ్చానని చెప్పుకొచ్చాడు మమ్ముట్టి. మధ్యలో పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా అవకాశం వచ్చినా మమ్ముట్టి తిప్పి కొట్టాడని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. మమ్ముట్టి ప్రస్తుతం తన కొత్త సినిమా మామంగం ప్రమోషన్ల పనుల్లో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మమ్ముట్టి సౌత్ ఇండియాలో భారీ లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ కూడా పాల్గొన్నాడు. ఆయన మమ్ముట్టి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. దాదాపు పదేళ్ల క్రితం మమ్ముట్టిని తాను పవన్ కళ్యాణ్ ను హీరోగా పెట్టి నిర్మిస్తున్న చిత్రంలో విలన్ గా చేయాలని కోరాను. దానికి ఆయన ఒకే ప్రశ్న వేశారు. ఇదే మీరు చిరంజీవిని అడగ్గలరా అని అడిగారు. దానికి నేను అడగలేను అని చెప్పాను. మరి నన్నెందుకు అడుగుతున్నారు అని అడిగారు. దానికి నా దగ్గర సమాధానం లేకపోయింది. ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాను అని చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.

- Advertisement -

అయితే ఆ పవన్ కళ్యాణ్ సినిమా పేరేంటో మాత్రం వెల్లడించలేదు. పదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో అల్లు అరవింద్ నిర్మించిన చిత్రమంటే ఆ టైమ్ లో జల్సా ఒకటే ఉంది. అందులో విలన్ పాత్ర అంటే ముకేశ్ రిషి పోషించినదే. అయితే ఆ పాత్రేమీ మమ్ముట్టి వచ్చి చేయాల్సినంత ప్రత్యేకమైనది కాదు. ఒకవేళ మమ్ముట్టి వచ్చి ఉంటే తనకి తగ్గట్లుగా పాత్ర ప్రాధాన్యత ఏమైనా పెంచేవారేమో కానీ రాకపోవడంతో ముకేశ్ రిషితో కానిచ్చేశారు. అదీ జరిగింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All