Homeగాసిప్స్సభకు నమస్కారం - ఆ నిర్మాణ సంస్థ టేకోవర్ చేయనుందా?

సభకు నమస్కారం – ఆ నిర్మాణ సంస్థ టేకోవర్ చేయనుందా?

సభకు నమస్కారం - ఆ నిర్మాణ సంస్థ టేకోవర్ చేయనుందా?
సభకు నమస్కారం – ఆ నిర్మాణ సంస్థ టేకోవర్ చేయనుందా?

వరస ప్లాపులతో కొట్టుమిట్టాడిన అల్లరి నరేష్ ఈ ఏడాది నాంది చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. సీరియస్ సబ్జెక్ట్ తో సాగే చిత్రమే అయినా నాందిలో అల్లరి నరేష్ సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అలాగే సినిమా కూడా విజయం సాధించింది. అదే ఊపులో అల్లరి నరేష్ తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రారంభించాడు. ఇప్పుడిప్పుడే నిర్మాతగా బిజీ అవుతోన్న మహేష్ ఎస్ కోనేరు నిర్మాణంలో ఈ చిత్రం అనౌన్స్ అయింది.

అయితే రీసెంట్ గా మహేష్ ఎస్ కోనేరు దురదృష్టవశాత్తూ గుండెపోటు కారణంగా మృతి చెందిన విషయం తెల్సిందే. దీంతో సభకు నమస్కారం ప్రాజెక్ట్ చిక్కుల్లో పడింది. అసలు ఈ చిత్రం ఆగిపోతుందని అనుకున్నారు అంతా. అయితే అల్లరి నరేష్ రంగంలోకి దిగాడు. తనకు క్లోజ్ ప్రొడక్షన్ హౌజ్ అయిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

- Advertisement -

అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ ను టేకోవర్ చేస్తాడని సమాచారం. సతీష్ మల్లంపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. సీనియర్ రైటర్ అబ్బూరి రవి ఈ చిత్రానికి రచనా సహకారం అందిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లరి నరేష్ రాజకీయవేత్తగా కనిపించనున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All