
కామెడీ చిత్రాలతో స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు అల్లరి నరేష్. ఈ మధ్య కామెడీ చిత్రాలతోనే ప్లాపులు ఫేస్ చేసిన నరేష్, నాంది వంటి డిఫరెంట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. నాంది చిత్రంలో అల్లరి నరేష్ కు పెర్ఫార్మన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాంది తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఈ నటుడు మరోసారి తన ఫెవరెట్ కామెడీ జోనర్ కు ఫిక్స్ అయ్యాడు.
ఈరోజు అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా తన 58వ సినిమాను ప్రకటించారు. తన నెక్స్ట్ సినిమాకు “సభకు నమస్కారం” అనే ఆసక్తికర టైటిల్ ను ఓకే చేసారు. పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన సతీష్ మల్లంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
జర్నలిస్ట్ నుండి పీఆర్వోగా మారి ఇప్పుడు నిర్మాత అయిన మహేష్ ఎస్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ద్వారా సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలవుతుంది. అబ్బూరి రవి కథ సహకారం అందిస్తున్నాడు. సభకు నమస్కారంకు సంబంధించి మరింత సమాచారం త్వరలోనే తెలుస్తుంది.
Sabhaku Namaskaram ????… with @smkoneru garu, @MallampatiSate1 and @abburiravi garu . #Naresh58 pic.twitter.com/cDXxmUarhr
— Allari Naresh (@allarinaresh) June 30, 2021