Homeగాసిప్స్అల్లరి నరేష్ కామెడీ చిత్రాలకు ఇక బ్రేక్ పడినట్లేనా?

అల్లరి నరేష్ కామెడీ చిత్రాలకు ఇక బ్రేక్ పడినట్లేనా?

Allari Naresh thinking to stop comedy based movies
Allari Naresh thinking to stop comedy based movies

అల్లరి నరేష్ ఒకప్పుడు తన కామెడీ చిత్రాలతో ఒక ఊపు ఊపేసాడు. లిమిటెడ్ బడ్జెట్ తో కామెడీ జోనర్ లో సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు. ఏడాదికి దాదాపు ఆరు సినిమాల వరకూ విడుదల చేసేవాడు అల్లరి నరేష్. అయితే ఈ మధ్య ఈ కామెడీ హీరో దూకుడు బాగా తగ్గించాడు. నరేష్ టైపు కామెడీ చిత్రాలకు ఆదరణ కరువైంది. నరేష్ వరసగా ప్లాపులను అందుకుంటున్నాడు.

- Advertisement -

ఇటీవలే అల్లరి నరేష్ హీరోగా వచ్చిన బంగారు బుల్లోడు సూపర్ ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా వచ్చి వెళ్లిన విషయం కూడా ఎవరికీ తెలీలేదు. అల్లరి నరేష్ కు ఈ జోనర్ లో మార్కెట్ పడిపోయిన విషయాన్ని ముందుగానే గ్రహించి ఇప్పుడు సీరియస్ సబ్జెక్ట్స్ వైపు దృష్టి మళ్ళించాడు. మహేష్ బాబు మహర్షిలో ఒక సీరియస్ రోల్ చేసిన అల్లరి నరేష్, నాంది అనే మరో సీరియస్ సబ్జెక్ట్ ను కూడా చేసాడు. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించాడు నరేష్. మరి ఈ సినిమా కనుక హిట్ అయితే తననుండి ఈ టైపు సినిమాలు మరిన్ని వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts