
నటీనటులు : అల్లరి నరేష్, పూజా జవేరి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, ప్రభాస్ శ్రీను, రజిత, భద్రం తదితరులు నటిస్తున్నారు.
దర్శకత్వం: గిరి పాలిక
నిర్మాత : సుంక రామబ్రహ్మం
సంగీతం: సాయి కార్తీక్
కెమెరా : సతీష్ ముత్యాల
మాటలు : వెలిగొండ శ్రీనివాస్
రిలీజ్ డేట్: 23-01-2021
రేటింగ్ : 2.5/5
`మహర్షి` చిత్రంలో మహేష్‌కు మిత్రుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అల్లరి నరేష్. ఈ మూవీ తరువాత ఆయన హీరోగా నటించిన చిత్రం `బంగారు బుల్లోడు`. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నరేష్ ఈ మూవీతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకున్నారా? .. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్‌కు ఈ చిత్రంతో మరోసారి మ్యాజిక్ చేశారా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
భవానీ ప్రసాద్ (అల్లరి నరేష్) గ్రామీణ బ్యాంకులో గోల్డ్ లోన్ డిపార్టమెంట్‌లో పనిచేస్తుంటాడు. అతనికి పెళ్లికాదు. అతనితో పాటు అతని బ్రదర్స్‌కీ పెళ్లి కాదు. దీనికి కారణం అతని తాతయ్య తనికెళ్ల భరణి చేసిన ఓ తప్పిదమని తెలుస్తెంది. అందుకోసం భవానీ ప్రసాద్ ఏం చేశాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటీ? .. తన తా చేసిన తప్పుని సరిదిద్దే క్రమంలో పూజా జవేరితో ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ పెళ్లి పీటలెక్కిందా? .. చివరికి ఎలా సుఖాంతమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
కామెడీ ఎంటర్‌టైనర్‌లకు అల్లరి నరేష్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిని విషయం తెలిసిందే. అతని నుంచి చాలా రోజుల విరామం తరువాత వస్తున్న సినిమా కవాడంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు అంతే ఆసక్తితో ఎదురుచూశారు. కానీ ఆ స్థాయిలో ఏమాత్రం అల్లరి నరేష్ నవ్వించలేకపోయాడు. భావోద్వేగా సన్నివేశాల్లో మాత్రం తనదైన నటనని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. హీయిన్ పూజా జవేరి కి నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. దాంతో గ్లామర్ డాల్గానే మిగిలిపోయింది. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, రజిత, భద్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
సాంకేతిక నిపుణులు:
అల్లరి నరేష్ గత చిత్రాలకు మించి ఈ చిత్రంలో కథ, దానికి తగ్గ ఎమోషన్‌ని జోడించారు. కానీ దాన్ని అనుకున్న స్థాయిలో తెరపై ఆవిష్కరించడంలో మాత్రం దర్శకుడు గిరి విఫలమయ్యాడని చెప్పొచ్చు. నరేష్ నుంచి ఆశించే కామెడీ సన్నివేశాలు ఏమాత్రం లేవంటే దర్శకుడు ఏ ధైర్యంతో ఈ సినిమాని తీశాడో అర్థం కాదు. సాయి కార్తీక్ సంగీతం ఫరవాలేదు. స్వాతిలో ముత్యమంత.. సాంగ్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే అతని కత్తెర పనిచేయలేదేమో అనిపిస్తుంది. సీన్‌లన్నీ సీరియల్ కి మించి ల్యాగ్ వుండటం గమనార్హం. సాంకేతిక నిపుణుల్లో ప్రభావాన్ని చూపించిన వ్యక్తి ఒక్కరే అది కెమెరామెన్ ముత్యాల సతీష్. గ్రామీణ వాతావరణాన్ని తన కెమెరాలో బంధించిన తీరు ఆకట్టుకుంటుంది.
తీర్పు:
బాలకృష్ణ నటించిన `బంగారు బుల్లోడు` హిట్ సినిమా కానీ అల్లరోడు నటించిన `బంగారు బుల్లోడు` మాత్రం ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయింది. అల్లరి నరేష్ సినిమా అంటే కామెడీని ఆశిస్తారు. కానీ ఈ చిత్రంలో ఏ సీన్‌లోనూ నవ్వించే ప్రయత్నం చేయలేదు. పైగా టేకింగ్ మరీ దారుణంగా వుండటంతో ప్రేక్షకులకు అసహనాన్ని తెప్పించే స్థాయిలో వుంది. కామెడీతో ఆకట్టుకోవాల్సిన ఈ చిత్రంలో ప్రధానంగా ఆదే మిస్సయింది.