Homeటాప్ స్టోరీస్అల్లరి నరేష్ ఈసారైనా హిట్ కొడతాడా?

అల్లరి నరేష్ ఈసారైనా హిట్ కొడతాడా?

అల్లరి నరేష్ ఈసారైనా హిట్ కొడతాడా?
అల్లరి నరేష్ ఈసారైనా హిట్ కొడతాడా?

అల్లరి సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నరేష్ కొద్ది కాలంలోనే కామెడీ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. తన కెరీర్ లో ఎక్కువగా కామెడీ ప్రధానమైన సినిమాలే చేస్తూ వచ్చిన నరేష్ కు మధ్యమధ్యలో మెయిన్ రూట్ నుండి పక్కకెళ్లి వెరైటీ సినిమాలు చేయడం అలవాటే. తన కెరీర్ లో నేను, శంభో శివ శంభో, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం వంటి విభిన్నమైన చిత్రాలను ప్రయత్నించాడు. సినిమాల ఫలితం సంగతి ఎలా ఉన్నా నటుడిగా అల్లరి నరేష్ కు చాలా మంచి పేరు వచ్చింది. అయితే కామెడీ ప్రధానమైన సినిమాలతో సక్సెస్ లు అందుకుని పైకి ఎదిగిన నరేష్ కు గత కొన్నేళ్లుగా హిట్ అన్నదే లేదు. సుడిగాడు సినిమా తర్వాత సరైన హిట్ లేక కెరీర్ లో సతమతమవుతున్నాడు. గతేడాది మహేష్ బాబు మహర్షిలో కీలక పాత్ర పోషించాడు.

చాలా కాలం తర్వాత తన కెరీర్ లో మరో విభిన్నమైన సినిమాను ప్రయత్నిస్తున్నాడు అల్లరి నరేష్. నాంది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకున్నాడు అల్లరి నరేష్. తలక్రిందులుగా నగ్నంగా వేలాడుతూ ఉన్న పోస్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత వీలైనంత త్వరలో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. మరి అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత అటెంప్ట్ చేస్తున్న విభిన్నమైన సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి. క్రైమ్ థ్రిల్లర్ ప్రధానంగా నాంది ఉండనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All