Homeటాప్ స్టోరీస్అందరి కళ్ళూ సీటిమార్ పైనే

అందరి కళ్ళూ సీటిమార్ పైనే

అందరి కళ్ళూ సీటిమార్ పైనే
అందరి కళ్ళూ సీటిమార్ పైనే

ప్రస్తుతం ఇంకా టాలీవుడ్ సందిగ్ద స్థితిలోనే ఉంది. కరోనా బ్రేక్ తర్వాత తెలుగు సినిమాలు విడుదలవుతున్నా పెద్ద చిత్రాలు విడుదలకు సముఖంగా లేవు. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల గురించి ఆందోళన చెందుతున్నారు నిర్మాతలు. అయితే ఇప్పట్లో అది సడలించే అవకాశం లేదు. దీంతో ఇక తప్పని పరిస్థితుల్లో తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలను చూసుకోవాలి.

ఇక రేపు వినాయక చవితి సందర్భంగా సీటిమార్ విడుదలవుతోంది. కొంత కాలం తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమా ఇది. ప్రస్తుతం గోపీచంద్ ఫామ్ లో లేకపోయినా కానీ సీటిమార్ పై అంచనాలు అయితే బాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి విడుదలవుతోన్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

సీటిమార్ ఫలితంపై ఆధారపడి చాలా సినిమాలు తమ విడుదలలను షెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటున్నాయి. సంపత్ నంది దర్శకత్వం వహించిన సీటిమార్ లో తమన్నా హీరోయిన్ గా నటించింది. మణిశర్మ స్వరాలు సమకూర్చాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All