Homeటాప్ స్టోరీస్ఈవారం విడుదలలు: టక్ జగదీష్, సీటిమార్, తలైవి

ఈవారం విడుదలలు: టక్ జగదీష్, సీటిమార్, తలైవి

ఈవారం విడుదలలు: టక్ జగదీష్, సీటిమార్, తలైవి
ఈవారం విడుదలలు: టక్ జగదీష్, సీటిమార్, తలైవి

బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాల్లో అంత అనుకూల ఫలితాలు అయితే లేవు కానీ సినిమాల ఫ్లో మాత్రం ఆగట్లేదు. అటు డిజిటల్ ఇటు థియేట్రికల్ కలిపి ఈ వారం మొత్తం మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. ముందుగా అందరి కళ్ళు టక్ జగదీష్ పైనే ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. సెప్టెంబర్ 9, రాత్రి 7 గంటల నుండే టక్ జగదీష్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.

ఇక థియేట్రికల్ రిలీజ్ ల విషయానికొస్తే గోపీచంద్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సీటిమార్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది. వినాయక చవితి స్పెషల్ గా సెప్టెంబర్ 10న ఈ సినిమా విడుదలవుతుంది.

- Advertisement -

అదే రోజున తలైవి కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తమిళనాడు సూపర్ స్టార్ జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All