
ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రమిది. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో దేశంలోనే తొలి క్రేజీ ప్రాజెక్ట్‌గా రికార్డులు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ ఆదివాసీ పోరాట యోధుడు కొరమం భీంగా, రామ్‌చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ మూడు గెటప్‌లలో కనిపించనుండగా ఎన్టీఆర్ కూడా ఆల్‌మోస్ట్ మూడు గెటప్‌లతో మెస్మరైజ్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
సినిమా ప్రారంభం నుంచి ఈ చిత్రంపై వరుసగా వార్తలు వినిపిస్తూనే వున్నాయి. తాజాగా మరో వార్ల సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో హీరోయిన్‌లుగా బాలీవుడ్ భామ అలియాభట్, హాలీవుడ్ లేడీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే పలు కీలక సన్నివేశాల్ని పూర్తి చేశారు. అలియాభట్ ఇంత వరకు షూటింగ్‌లో పాల్గొనలేదు. ఇటీవలే రాజమౌళి `మహేష్‌భల్ డాటర్ కోసం ఎదురుచూస్తున్నాం` అంటూ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో అనుమానాలు మొదలయ్యాయి. అలియా డేట్స్ ఇవ్వడం లేదా? ఆర్ ఆర్ ఆర్ టీమ్‌కు ఎందుకు సహకరించడం లేదు? అని ఆరాతీయడం మొదలుపెట్టారు.
తాజాగా డేట్స్ సమస్య కారణంగా అలియాభట్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ చిత్రం గంగూభాయ్‌తో పాటు బ్రహ్మాస్త్ర చిత్రంలోనూ అలియాభట్ నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు డేట్స్ అడ్జెస్ట్ చేసిన అలియా `ఆర్ ఆర్ ఆర్` కు మాత్రం అడ్జస్ట్ చేయలేకపోతోందట. ఆ కారణంగానే ఆమె ఈ చిత్రం నుంచి తప్పకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటికి రాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.