Homeగాసిప్స్`ఆర్ఆర్ఆర్` కోసం అలియా టీమ్‌కు భారీ ఖ‌ర్చు!

`ఆర్ఆర్ఆర్` కోసం అలియా టీమ్‌కు భారీ ఖ‌ర్చు!

`ఆర్ఆర్ఆర్` కోసం అలియా టీమ్‌కు భారీ ఖ‌ర్చు!
`ఆర్ఆర్ఆర్` కోసం అలియా టీమ్‌కు భారీ ఖ‌ర్చు!

గ‌త కొన్ని నెల‌లుగా అలియాభ‌ట్ రాక కోసం రాజ‌మౌళి, `ఆర్ఆర్ఆర్‌` టీమ్ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోంది. ఆ ఎదురుచూపుల‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఆదివారం అలియాభ‌ట్ హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది. ఆదివారం సాయంత్రం ముంబై నుండి హైద‌రాబాద్ బ‌య‌లుదేరిన అలియా శంషాబాద్ ఏయిర్‌పోర్ట్‌లో సంద‌డి చేసింది. గ్రీన్ అండ్ బ్లాక్ క‌ల‌ర్ కాంబినేష‌న్ డ్రెస్‌లో హై హీల్స్ ని గుర్తు చేస్తున్న‌ట్టున్న బ్లాక్ షూస్‌తో హ‌డావిడి చేసింది.

సోమ‌వారం నుంచి అలియా `ఆర్ఆర్ఆర్` షూట్‌లో పాల్గొన‌బోతోంది. ఈమె వెంట పెద్ద బ్యాచే దిగింది. ఆమె వ్య‌క్తిగ‌త సిబ్బంది బౌన్స‌ర్స్‌తో క‌లిపి మొత్తం ప‌ది మంది. ఇందులో న‌లుగురు బౌన్స‌ర్స్‌.. మేక‌ప్ ఆర్టిస్ట్‌, పెర్స‌న‌ల్ అసిస్టెంట్‌, హెయిర్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ అండ్ మేనేజ‌ర్‌. వీరంతా అలియాతో క‌లిసి స్టార్ హోట‌ల్‌లో దిగారు. అలియా వ్య‌క్తిగ‌త సిబ్బంది రోజు ఖ‌ర్చు అక్ష‌రాలా ల‌క్ష‌రూపాయ‌ల‌ట‌.

- Advertisement -

అలియా రంగంలోకి దిగితే ఈ స్థాయిలో ఖ‌ర్చు వుంటుంద‌ని ముందే `ఆర్ఆర్ఆర్` టీమ్‌, జక్క‌న్న ఓ అంచ‌నాకు వ‌చ్చి అందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. దీంతో ఎలాంటి టెన్ష‌న్ లేకుండా సోమ‌వారం నుంచి అలియా పాల్గొన‌గా కీల‌క ఘ‌ట్టాల‌ని షూట్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అలియా ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా సీత పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All