Homeటాప్ స్టోరీస్రాజ‌మౌళికి ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్!

రాజ‌మౌళికి ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్!

రాజ‌మౌళికి ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్!
రాజ‌మౌళికి ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్!

`బాహుబ‌లి` సిరీస్ చిత్రాల‌తో రాజ‌మౌళి పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ద‌ర్శ‌కుడిగా గుర్తింపుని సంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆయన తీస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌` దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పైగా ఈ చిత్రాన్ని స్వాతంత్య్రం కోసం పోరాడిన పోరాట యోధుల క‌థ‌తో ఓ ఫిక్ష‌న‌ల్ మూవీగా తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీంగా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ మూవీకి సంబంధించిన `రామ రాజు ఫ‌ర్ భీమ్‌` టీజ‌ర్‌ని మేక‌ర్స్ ఇటీవ‌లే రిలీజ్ చేశారు. టీజ‌ర్‌లో ఎన్టీఆర్‌ని చూపించిన విధానం.. అత‌ని పాత్ర‌ని ఎలివేట్ చేసిన విధానం ప్ర‌తీ ఒక్కరికీ గూస్ బంప్స్ తెచ్చించింది. అయితే టీజ‌ర్ చివ‌ర్లో ఎన్టీఆర్ ముస్లీమ్‌గా క‌నిపించ‌డం, టోపీ ధ‌రించ‌డం పై వివాదం మొద‌లైంది. అలా ఎందుకు చూపించార‌ని కొంత మంది నిల‌దీస్తున్నారు. నిజాం నిరంకుశానికి వ్య‌తిరేకంగా ఎద‌రునిలిచి పోరాడిన గోండు బెబ్బులిని ముస్లీమ్‌గా చూపించ‌డం ఆదివాసీల‌కు న‌చ్చ‌డం లేదు.

- Advertisement -

తాజాగా ఇదే విష‌యంపై స్పందించిన ఎంపీ సోయం బాపూరావు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భీం పాత్ర‌కు పెట్టిన టోపీ ధృశ్యాల‌ని వెంట‌నే తొల‌గించాల‌ని, లేదంటే సినిమా రిలీజ్ చేసిన థియేట‌ర్ల‌ని త‌గుల బెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. కెక్ష‌న్‌ల కోసం మా దైవాన్ని కించ‌ప‌రిస్తే ఎట్టిప‌రిస్థితుల్లో ఉపేక్షించ‌బోమ‌య‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న హెచ్చ‌రించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All