Homeటాప్ స్టోరీస్అలియాభ‌ట్ కండీష‌న్స్ అప్లై అంటోందా?

అలియాభ‌ట్ కండీష‌న్స్ అప్లై అంటోందా?

అలియాభ‌ట్ కండీష‌న్స్ అప్లై అంటోందా?
అలియాభ‌ట్ కండీష‌న్స్ అప్లై అంటోందా?

బాలీవుడ్ క్రేజీ లేడీ అలియాభ‌ట్ తెలుగులో తొలిసారి న‌టిస్తున్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. మెగా ప‌వ‌ర్‌స్టార్  రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు గా, ఎన్టీఆర్ ఆదివాసీ పోరాట యోధుడు కొమ‌రం భీంగా న‌టిస్తున్నారు.

కీల‌క మైన అతిథి పాత్ర‌ల్లో అజ‌య్ దేవ‌గ‌న్‌, శ్రియ, స్పంద‌న్ చ‌తుర్వేది న‌టిస్తుండ‌గా హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్‌స‌న్‌, అలీస‌న్ డూడీ, ఒలివియా మోరీస్‌, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కీల‌క ఘ‌ట్టాల‌తో పాటు లాక్‌డౌన్ బిఫోర్ దాదాపు 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. అలియాభ‌ట్‌కి సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ తో పాటు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు సంబంధించిన సీన్స్ బ్యాలెన్స్‌గా వున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

అయితే ఈ సినిమాకు అలియా కేటాయించిన డేట్స్ క‌రోనా వైర‌స్ కార‌ణంగా అయిపోవ‌డంతో అక్టోబ‌ర్ నుంచి మ‌ళ్లీ డేట్స్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. దీని కోసం రాజ‌మౌళి టీమ్‌కి అలియా కండీష‌న్స్ పెట్టిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్ లేదా జ‌న‌వ‌రి నుంచి హిందీ చిత్రాల షూటింగ్‌లో పాల్గొనాలి కాబ‌ట్టి `ఆర్ ఆర్ ఆర్‌`కి సంబంధించి త‌న షూటింగ్‌ని అక్టోబ‌ర్‌లో పూర్తయ్యేలా ప్లాన్ చేయ‌మ‌ని అలియా కండీన్ పెట్టింద‌ట‌. దీంతో రాజ‌మౌళి అక్టోబ‌ర్ నుంచి `ఆర్ ఆర్ ఆర్‌` కీల‌క షెడ్యూల్‌ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All