Homeటాప్ స్టోరీస్అల వైకుంఠపురములో సరికొత్త స్ట్రాటజీ : ఇది అమెజాన్ లో రాదు

అల వైకుంఠపురములో సరికొత్త స్ట్రాటజీ : ఇది అమెజాన్ లో రాదు

ala vaikuntapuramulo
ala vaikuntapuramulo

ఒకప్పుడు బంగారు బాతు గుడ్డు లాంటి యూఎస్ మార్కెట్ ఈ మధ్య పూర్తిగా చతికిలపడిపోయింది. బడా బడా సినిమాలు, యూఎస్ లో పూరిగా పట్టున్న హీరోలు కూడా ఇక్కడ ఖంగుతిన్నారు. మహర్షి ఇక్కడ 2 మిలియన్ అందుకోలేక చతికిలపడింది. సాహో 3మిలియన్ దాటినా మిలియన్ కు పైగా నష్టాలను తీసుకొచ్చింది. సైరా పరిస్థితి కూడా అంతే. అర మిలియన్ పైన నష్టాలు తప్పేలా లేదు.

సడెన్ గా ఎందుకిలా అయింది? యూఎస్ లో తెలుగు మార్కెట్ పూర్తిగా డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి? అందరికీ కనిపిస్తున్న ప్రధాన కారణం అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సైట్ల ప్రభావం. ఎలాగో నెల రోజుల్లో ఈ యాప్స్ లో, సైట్లలో వస్తున్నప్పుడు ఇంకెందుకు థియేటర్ కు వెళ్లడం అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇదే సమస్య మన దగ్గర కూడా ఉన్నా యూఎస్ లో అధికంగా ఉంది.

- Advertisement -

దీన్ని ఎదుర్కోవడానికి అల వైకుంఠపురములో యూఎస్ డిస్ట్రిబ్యూటర్ సరికొత్త ఎత్తుగడ వేసాడు. అల్లు అర్జున్, పూజ హెగ్డే ఉన్న ఒక పిక్ షేర్ చేసాడు. అందులో “ఈ సినిమా మీకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో కనిపించదు” అని ఉంది. ప్రేక్షకులు ఇది చూసైనా థియేటర్ కు వస్తారని వారి భావన. సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత కానీ స్ట్రీమింగ్ సైట్లో విడుదల చేయకూడదని డీల్ చేసుకుంటే బెటర్ అని ట్రేడ్ సూచిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All