
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో సినిమాలోని మొదటి సింగిల్ ‘సామజవరగమన’ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెల్సిందే. ఒక్క రోజులోనే 8 మిలియన్ వ్యూస్ దాటి వ్యూస్ వచ్చాయంటే ఈ పాట ఎంతగా అలరిస్తోందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే రెస్పాన్స్ బాగున్నా ఒక వర్గం ఈ పాటలో అర్ధవంతమైన లిరిక్స్ ను సింగర్ ఖూనీ చేసిన విధానాన్ని తప్పుపడుతున్నారు. ఈ విధమైన విమర్శలు చేసినవారిలో ప్రముఖులు సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్. సోషల్ మీడియాలో ఈ పాటపై విమర్శలు చేసారు. ఈ పాట పాడిన సింగర్, దాన్ని ఓకే చేసిన థమన్ ను ఉద్దేశిస్తూ ‘నీ ఉచ్ఛారణకి నా జోహార్లు. కేవలం నీ టైం నడుస్తుంది కాబట్టి నువ్వెలా ఖూనీ చేసి పాడినా దాన్ని అదే మహా ప్రసాదం అని భావించిన ఆ సంగీత దర్శకుడికి సాష్టాంగ ప్రాణామాలు. మై డియరెస్ట్ కండోలెన్సెస్ టు ది లిరిక్స్’ అని కల్యాణి మాలిక్ అన్నాడు.
అద్భుతమైన భావుకతతో సీతారామశాస్త్రి అందించిన లిరిక్స్ ను భాష తెలియని సిద్ శ్రీరామ్ పాడిన విధానం నిజంగానే అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.