Homeటాప్ స్టోరీస్న్యూమరాలజీ ఫాలో అవుతున్న అల వైకుంఠపురములో..

న్యూమరాలజీ ఫాలో అవుతున్న అల వైకుంఠపురములో..

Ala Vaikuntapuramulo
Ala Vaikuntapuramulo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుండగా నిన్న ఈ చిత్రంలోనుండి మొదటి పాట “సామజవరగమన”ను విడుదల చేసారు. సీతారామశాస్త్రి రచనలో, థమన్ సంగీతం సారధ్యంలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ మెలోడియస్ పాట శ్రోతలను ఇట్టే ఆకట్టుకుంటోంది.

యూట్యూబ్ లో ఈ పాట పాత రికార్డులను తిరగరాస్తోంది. పాట విడుదలైన 15 గంటల్లోనే ఈ పాట దాదాపు 5 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ పాటతో చిత్రం మీద సరైన అంచనాలు ఏర్పడ్డాయి అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంచితే.. ఈ పాట యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు సినిమా టైటిల్ ను ఇంగ్లీష్ లో Ala Vaikuntapurramulo… ని ఉంది. సరిగ్గా గమనిస్తే ఒక R ఎక్కువగా వాడుతున్నారు.

- Advertisement -

ఈ చిత్రాన్ని ముందు ప్రమోట్ చేసినప్పుడు ఒక R తక్కువగా Ala Vaikuntapuramulo… అని ఉండేది. కానీ ఇప్పుడు R ను చేర్చడం వెనక న్యూమరాలజీ, ఉందని తెలుస్తోంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ చిత్రం కావడంతో గురి తప్పడకూడదని న్యూమరాలజీ కూడా ఫాలో అవుతున్నారన్నమాట.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All