Homeటాప్ స్టోరీస్ఓవర్సీస్ బిజినెస్ కు దెబ్బేస్తున్న అమెజాన్

ఓవర్సీస్ బిజినెస్ కు దెబ్బేస్తున్న అమెజాన్

ఓవర్సీస్ బిజినెస్ కు దెబ్బేస్తున్న అమెజాన్
ఓవర్సీస్ బిజినెస్ కు దెబ్బేస్తున్న అమెజాన్

ఒకప్పుడు ఓవర్సీస్ అంటే టాలీవుడ్ కు బంగారు బాతు గుడ్డు. ఇక్కడ నైజాం ఏరియా కలెక్షన్స్ స్థాయిలో అక్కడ బిజినెస్ చేసేవి మన తెలుగు సినిమాలు. ఈ నేపథ్యంలో మన వాళ్ళు కూడా ఓవర్సీస్ మార్కెట్ పై శ్రద్ధ పెట్టేవారు. వారి సెన్సిబిలిటీస్ ను దృష్టిలో పెట్టుకుని కథలు అల్లేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మంచి టాక్ వచ్చినా కానీ మహేష్ బాబు సినిమాకి యూఎస్ లో 2 మిలియన్ రావడం గగనమైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితికి ప్రధానంగా అమెజాన్ ను నిందిస్తున్నారు విశ్లేషకులు. ఇదివరకు సినిమా అంటే రిపీట్ ఆడియన్స్ ఉండేవారు. ఏదైనా సినిమా నచ్చితే ఒకటికి రెండు మూడు సార్లు చూసేవారు. దాంతో సినిమాలకు లాంగ్ రన్ ఉండేది.

- Advertisement -

కానీ ఇప్పుడు ఏదైనా సినిమాను ఒక్కసారి చూస్తే ఎక్కువ అన్నట్లు ఉంది పరిస్థితి. మరోసారి చూద్దామనుకున్నా ఎందుకు డబ్బులు వేస్ట్ ఎలాగ్గూ అమెజాన్ లో వస్తుందిగా అనుకుంటున్నారు సినిమా లవర్స్. నెల రోజులు తిరక్కుండానే అమెజాన్ లో సినిమా వచ్చేస్తుంటే థియేటర్లకు వెళ్లి డబ్బులు తగలేసుకోవడం ఎందుకనే సాధారణ మధ్యతరగతి ప్రేక్షకుడు అనుకుంటాడు. అందులో వాళ్ళ తప్పేం లేదు. ఒక్క రిలీజ్ కు ముందే డీల్ సెట్ చేసుకుని థియేటర్ బిజినెస్ ను చంపేస్తున్న నిర్మాతది తప్ప.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All