
బాలీవుడ్ అంటే ఖాన్‌ల కింగ్‌డమ్. కానీ అది నిన్నటి మాట కిలాడీ అక్షయ్‌కుమార్ రావడం, బీజేపీ అంటే ఖాన్‌ల త్రయానికి కంటగింపుగా మారడంతో అక్షయ్‌కుమార్‌కు బాలీవుడ్‌లో బీజేపీ వెన్నుదన్నుగా నిలిచింది. అతన్ని ప్రతి విషయంలోనూ సపోర్ట్ చేస్తూ టాప్ ప్లేపస్‌లో నిలబెట్టే ప్రయత్నం చేసింది. అప్పటి నుంచి ఖాన్‌ల త్రయానికి గడ్డు కాలం మొదలైంది.
స్వయంగా మోదీ హీరో అక్షయ్ కుమార్‌తో ఇంటర్వ్యూ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అక్షయ్‌కి భారతీయ పౌరసత్వం లేకపోయినా అతన్ని ప్రోత్సహిస్తూ వచ్చింది అధికార బీజేపీ .. అయితే తాజాగా ఓ లాయర్ పెట్టిన పోస్ట్‌తో ఆ సీన్ మారేలా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్ వ్యక్తిగత లాయర్ విబోర్ ఆనంద్ హీరో అక్షయ్‌కుమార్‌కు `డీ` గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని ట్విట్టర్ వేదికగా వెల్లడించడం బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.
అక్షయ్‌కి `డీ` గ్యాంగ్‌ని ఎందుకు కలిశారు?. పాకిస్థాన్ ఐఎస్ ఐ ఏజెంట్స్ కి అత్యంత సన్నిహితంగా వుంటే డీ గ్యాంగ్‌తో ఆయనకున్న పనేంటి? అని కొన్ని ఫొటోలని కూడా విబోర్ ఆనంద్ షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ బాలీవుడ్‌లో వైరల్‌గా మారింది. అక్షయ్ వ్యక్తగత లాయర్ ఏ ఉద్దేశంతో ఈ ఫొటోలని షేర్ చేశాడు? .. ఈ ఫొటోల్లో వున్న నిజమెంత? అని కొంత మంది ఆరా తీస్తుంటే మరి కొంత మంది మాత్రం అక్షయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారట.