Homeగాసిప్స్బంగార్రాజులో సర్ప్రైజ్ ఖాయమేనా?

బంగార్రాజులో సర్ప్రైజ్ ఖాయమేనా?

బంగార్రాజులో సర్ప్రైజ్ ఖాయమేనా?
బంగార్రాజులో సర్ప్రైజ్ ఖాయమేనా?

అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య లీడ్ పాత్రల్లో నటిస్తోన్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చాలా కాలం డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్న ఈ చిత్రం మొత్తానికి మొదలైంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇది  ప్రీక్వెల్ అని చెప్పవచ్చు. అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ సెట్ వేసి షూటింగ్ ను చేస్తున్నారు.

నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన కృతి శెట్టి ఈ సినిమాల్లో ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. నాగార్జున, నాగ చైతన్య మాత్రమే కాకుండా ఈ సినిమాలో అఖిల్ కూడా నటించనున్నాడట.

- Advertisement -

అయితే అది కేవలం కేమియో పాత్ర మాత్రమేనని, కీలక సమయంలో అఖిల్ స్పెషల్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All