Homeటాప్ స్టోరీస్నాగ చైతన్య, నాగార్జునల బంగార్రాజు షురూ!

నాగ చైతన్య, నాగార్జునల బంగార్రాజు షురూ!

నాగ చైతన్య, నాగార్జునల బంగార్రాజు షురూ!
నాగ చైతన్య, నాగార్జునల బంగార్రాజు షురూ!

ఎప్పటినుండో వార్తల్లో ఉంటూ వస్తోన్న బంగార్రాజు ప్రాజెక్ట్ మొత్తానికి మొదలైంది. ఈ సినిమాకు ఈరోజు ముహూర్తం కుదిరింది. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది ఈ చిత్రం. ఫాంటసీ, యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

బంగార్రాజులో నాగార్జునకు జోడిగా రమ్య కృష్ణ నటిస్తోంది. అలాగే నాగ చైతన్య, కృతి శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే నాగార్జున ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. దీంతో పాటు బిగ్ బాస్ తెలుగు 5 కు హోస్ట్ గా వ్యవహరిస్తాడు నాగ్.

- Advertisement -

ఇలా వరస కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఇక సోగ్గాడే చిన్ని నాయన టీమ్ దాదాపుగా బంగార్రాజుకు వర్క్ చేస్తుంది. బంగార్రాజు దానికి ప్రీక్వెల్ అన్న విషయం ఇప్పటికే ధృవీకరించబడింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All