
అఖిల్ అక్కినేని ప్రస్తుతం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలో నటిస్తున్నారు. అఖిల్ నటిస్తున్న 4వ చిత్రమిది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత తన 5వ చిత్రాన్ని అఖిల్ అక్కినేని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డితో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. సరెండర్ 2 సినిమా బ్యానర్‌పై సురేందర్ రెడ్డి కూడా ఈ మూవీకి సహ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.
నేడు అఖిల్ పుట్టిన రోజు ఈ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి `ఏజెంట్` అనే టైటిల్‌ని ఫైనల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అఖిల్ సరికొత్త మేకోవర్‌తో మ్యాన్లీగా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డంతో సిగరేట్ కాలుస్తూ అఖిల్ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. సరికొత్త యాటిట్యూడ్‌తో అతని పాత్రని సరికొత్తగా మలిచినట్టుగా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. గతంలో సురేందర్‌రెడ్డితో కలిసి కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలకు వక్కంతం వంశీ కలిసి పనిచేశారు. కొంత విరామం తరువాత మళ్లీ వీరిద్దరూ కలిసి మరో బ్లాక్ బస్టర్ హిట్ కోసం వర్క్ చేస్తున్న చిత్రమిది. గూఢచారి థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీని హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు తీసిపోని స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ నెల 11 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది డిసెంబర్ 24న ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం, రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్రాఫీని అందిస్తున్నారు.
PRESENTING TO YOU A NEW ME
Crafted by the man himself, Mr @DirSurender ! Thank you sir, I officially surrender to Surender.
A big thank you to my dynamic producer @AnilSunkara1 garu as well.AGENT Loading ????#Agent #AgentLoading @AKentsOfficial @S2C_Offl pic.twitter.com/xVRGyf3z5I
— Akhil Akkineni (@AkhilAkkineni8) April 8, 2021