
అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలో రిలీజ్ రెడీ అవుతున్న వేళ అఖిల్ మరో చిత్రానికి రెడీ అయిపోతున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. తాజాగా ఆ వార్తల్ని నిజం చేస్తూ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని ఈ నెల 8న ఉదయం 9:09 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేసింది.
బాండ్ తరహా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని మెలికలు తిరిగిన ఆరు పలకల దేహం (సిక్స్ ప్యాక్)తో కనిపించబోతున్నారని, ఓ విధంగా చెప్పాలంటే జేమ్స్ బాండ్ తరహాలో అతని పాత్ర చిత్రణ వుంటుందని, సినిమా కూడా హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోయి స్థాయిలో వుంటుందని, టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌లో ఈ మూవీని అనిల్ సుంకర ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
‘????’ is Ready to KILL &
‘????’ is Ready to STUN ????#Akhil5FirstLook Blast on April 8th at 9:09 AM ????@AkhilAkkineni8 @AnilSunkara1 @AKentsOfficial #S2C#Akhil5 pic.twitter.com/tXRnc7Skog— SurenderReddy (@DirSurender) April 6, 2021