Homeన్యూస్అఖండ టైటిల్ సాంగ్: పవర్ఫుల్

అఖండ టైటిల్ సాంగ్: పవర్ఫుల్

అఖండ టైటిల్ సాంగ్: పవర్ఫుల్
అఖండ టైటిల్ సాంగ్: పవర్ఫుల్

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే అఖండ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. కొద్దిసేపటి క్రితం అఖండ టైటిల్ సాంగ్ ను విడుదల చేసారు. భం అఖండ అంటూ సాగే టైటిల్ సాంగ్ పవర్ఫుల్ గా ఉందని చెప్పాలి. ఈ సాంగ్ కథలో కీలకమైన సమయంలో వస్తుందని అర్ధమవుతోంది.

బాలకృష్ణ ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ లో నటిస్తుండగా ఒక పాత్రగా అఘోరాగా కనిపించనున్నాడు. అఘోరా పాత్ర తాలూకూ సాంగ్ ఇది. అనంత్ శ్రీరామ్ ఈ సాంగ్ కు సాహిత్యాన్ని అందించాడు. కొన్ని క్లిష్టమైన పదాలను వాడుతూనే రైమింగ్ కూడా మైంటైన్ చేసాడు. ఎస్ ఎస్ థమన్ అందించిన సంగీతం కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంది. తన బ్రాండ్ పవర్ ను మరోసారి నిరూపించాడు థమన్.

- Advertisement -

ఇంత పవర్ఫుల్ సాంగ్ ను పాడటానికి అంతే పవర్ఫుల్ వాయిస్ కావాలి కదా. అందుకే శంకర్ మహదేవన్ రంగంలోకి దిగాడు. శంకర్ మహదేవన్ వాయిస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. శంకర్ కు తోడు సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ కూడా గొంతు కలిపారు.

బోయపాటి శ్రీను అఖండను డైరెక్ట్ చేసిన విషయం తెల్సిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ రోల్ ను పోషించాడు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All