Homeన్యూస్రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో అఖండ

రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో అఖండ

రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో అఖండ
రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో అఖండ

నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా షూటింగ్ లో పలుమార్లు జాప్యం జరగగా మొత్తానికి షూటింగ్ ను పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ప్రస్తుతం అఖండ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే అఖండ విడుదల తేదీపై ప్రస్తుతం కన్ఫ్యూజన్ నెలకొంది.

ముందుగా నిర్మాతలు అఖండను దీపావళికి ప్లాన్ చేస్తున్నట్లుగా బయ్యర్లకు సమాచారం అందించారు. భారీ బడ్జెట్ తో తీసిన అఖండను దీపావళికి విడుదల చేయడంపై వారు అంత సంతృప్తిగా లేరు. దీంతో మరో డేట్ కోసం చూస్తున్నారు. డిసెంబర్ 3న విడుదల చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన వచ్చినా ఆ రోజున పలు చిత్రాలు తమ విడుదల తేదీలను ప్రకటించుకున్నాయి.

- Advertisement -

దీంతో అఖండ ఎప్పుడు రావాలన్న దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. మిర్యాల రవీందర్ రెడ్డి అఖండను నిర్మించాడు. బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All