
నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ షూటింగ్ మొత్తానికి పూర్తయింది. గతేడాది మొదలైన ఈ చిత్ర షూటింగ్ కరోనా కారణంగా పలు వాయిదాలు పడుతూ ముందుకు సాగింది. అయితే చిత్ర షూటింగ్ పూర్తయినట్లు టీమ్ అధికారికంగా వెల్లడించింది.
మాస్ ఎంటర్టైనర్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా చేస్తోన్న ఈ సినిమాలో పూర్ణ మరో ప్రముఖ పాత్ర చేస్తోంది. శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. అఖండ టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. రెండు భిన్నమైన గెటప్స్ లో బాలకృష్ణ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. అందులో ఒకటి అఘోరా గెటప్.
ఎస్ ఎస్ థమన్ అఖండకు సంగీతం అందిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. అఖండ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీపావళి సీజన్ ను కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఏదేమైనా విడుదల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తున్నారు.
And it’s a wrap for Blockbuster combo #NandamuriBalakrishna & #BoyapatiSrinu‘s film #Akhanda ?
Post production works in full swing, Roaring? in cinemas soon#AkhandaShootWrapped#BB3 @ItsMePragya @MusicThaman @actorsrikanth @IamJagguBhai @dwarakacreation #MiryalaRavinderReddy pic.twitter.com/SKNzH6M0Bd— Dwaraka Creations (@dwarakacreation) October 5, 2021