HomeVideosవాలిమై టీజర్: క్లాస్ తో మాస్ ను ప్రెజంట్ చేస్తోన్న అజిత్

వాలిమై టీజర్: క్లాస్ తో మాస్ ను ప్రెజంట్ చేస్తోన్న అజిత్

వాలిమై టీజర్: క్లాస్ తో మాస్ ను ప్రెజంట్ చేస్తోన్న అజిత్
వాలిమై టీజర్: క్లాస్ తో మాస్ ను ప్రెజంట్ చేస్తోన్న అజిత్

తమిళ సూపర్ స్టార్ తలా అజిత్ కుమార్ నటించిన వాలిమై చిత్రంపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. అజిత్ కు తెలుగులో కూడా ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని ఇక్కడా విడుదల చేస్తారు. ఇక వాలిమై గ్లిమ్స్ పేరుతో కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన టీజర్ అదిరిపోయిందంతే.

హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తోన్న వాలిమై టీజర్ పరంగా అందరి అంచనాలను అందుకుంది. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ లో బైక్ ఫీట్ లపై ఫోకస్ చేసారు. ఒక బిల్డింగ్ లోంచి మరో బిల్డింగ్ లోకి అజిత్ బైక్ పై జంప్ చేయడం ఈ గ్లిమ్స్ కు ప్రధాన ఆకర్షణ. ఇక గ్లిమ్స్ అంతా అజిత్ హవా నడిచింది.

- Advertisement -

వాలిమైలో విలన్ గా కార్తికేయ నటించిన విషయం తెల్సిందే. ఈ గ్లిమ్స్ లో కార్తికేయ, అజిత్ ల మధ్య ఉండే క్లాష్ ను కూడా చూపించారు. ఇక యువన్ శంకర్ రాజా సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుమ్మేసాడు. బోనీ కపూర్ ఈ సినిమాకు నిర్మాత. వచ్చే పొంగల్ కు వాలిమై విడుదల కానుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All